గీతా గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏదో నడుస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ జంట ఇటీవల ఎక్కడ కనిపించినా కూడా కచ్చితంగా సింక్ చేసి మరి వీరిద్దరి మీద పలు రూమర్లు సృష్టిస్తూ ఉన్నారు పలువురు నెటిజన్స్. ఓకే ఇంట్లోనే సహజీవనం కొనసాగిస్తున్నారని ప్రచారం కూడా జరుగుతోంది.. దక్షిణాది నుంచి ముంబై పరిశ్రమకు వెళ్ళిన తర్వాత రష్మికపై ఇలాంటి వార్తలు మరింత వైరల్ గా మారాయి. ఇటీవల రష్మిక పుట్టినరోజున ఆమె ఎడమ చూపుడు వేలుకు ఒక ఉంగరం కనిపించడంతో ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.అయితే ఈ ఉంగరాన్ని కప్పి ఉంచే ప్రయత్నం చేయడం చాలా సందేహాలకు తావునిస్తోంది.రష్మిక ఉంగరాన్ని గమనించిన నేటిజన్స్ వెంటనే అది రష్మిక ప్రియుడు విజయ్ దేవరకొండ ఇచ్చిన కానుక అన్నట్లుగా అనుమానాలను తెలియజేస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి విషయాల పైన రష్మిక అసలు స్పందించలేదు తాము మంచి స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కానీ ముంబై మీడియాలో వచ్చిన వరుస కథనాలతో ఇటు సౌత్లో అభిమానులు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
రష్మిక చేతికి ఉన్న ఉంగరం తొడిగింది ఎవరు రష్మిక ఏమని జవాబు ఇస్తుంది అంటు కామెంట్స్ చేస్తూ ఉండడంతో.. చాలా సింపుల్ గా ఈ విషయాన్ని ఖండించింది అయ్యా ఓవర్గా ఆలోచించకండి బాబు అంటూ రష్మిక కొంటెగానే సమాధానం ఇచ్చింది. అయితే ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ ఇది విజయ్ దేవరకొండ ఇంటి నుంచే విడుదల చేయబడిన వీడియో అందుకు ఉదాహరణగా విజయ్ దేవరకొండ ఒకప్పుడు దిగిన ఫోటోలలో ఇంటి పైకప్పు రష్మిక వీడియో చేసిన పైకప్పు ఒకే లాగా ఉండడంతో పాటు ఇంటి పరిసరాలలోనే చుట్టూ కూడా అలాగే కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు కానీ ఈ విషయాన్ని మాత్రం రష్మిక లైటుగా తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: