
దీంతో మేకర్స్ వెనక్కి తగ్గి గ్రాఫిక్స్ పూర్తిగా మార్చేసి మళ్లీ కొత్తగా సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. జూన్ 16వ తేదీన ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదల కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపద్యంలో చిత్రబృందం మొత్తం ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఎంతో భారీగా నిర్వహించేందుకు ఆది పురుష్ టీం సిద్ధమైంది అన్నది తెలుస్తుంది..
అయితే 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శక దీరుడు రాజమౌళి చీప్ గెస్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. తిరుపతిలోని ఎస్వీ గ్రౌండ్స్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారట. ఇక మే 9వ తేదీన సినిమా విడుదల కానుంది అని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే సాహో, రాధశ్యామ్ సినిమాలతో వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ కి ఆది పురుష్ సినిమా అయినా సూపర్ సక్సెస్ ని అందిస్తుందో లేదో చూడాలి మరి.