తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ నటుల్లో ఒకరు అయినటు వంటి ప్రియదర్శి హీరో గా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో బలగం అనే ఒక తక్కువ బడ్జెట్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయ్యి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని ... ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్ లను వసూలు చేయడం మాత్రమే కాకుండా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది.

మూవీ విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతున్న సమయం లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది  ఈ మూవీ కి "ఓ టి టి" ప్రేక్షకుల నుండి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సమయంలో కూడా థియేటర్ లలో అద్భుతమైన కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా థియేటర్ లలో ... "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే బుల్లి తెర పై కూడా ప్రచారం అయింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటు వంటి స్టార్ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే స్టార్ సంస్థ వారు స్టార్ మా చానల్లో ప్రసారం చేశారు. ఈ మూవీ మొదటి సారి బుల్లి తెర పై ప్రసారం అయినప్పుడు 14.30 "టి ఆర్ పి" రేటింగ్ ను సొంతం చేసుకుంది.  ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు అదిరిపోయే రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది అని చెప్పవచ్చు. ఇలా ఈ మూవీ థియేటర్ ... "ఓ టి టి" ... బుల్లి తెర ప్రేక్షకులను అదిరిపోయే అదిరిపోయే రేంజ్ లో అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: