పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఆ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ లలో పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలే కాకుండా హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. గత కొంతకాలంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇంతలోనే మరొక సంచలన దర్శకుడు తో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా  చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చేస్తే గనుక పవన్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు. 

వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ఆ సినిమాపై భారీ అంచనాలు ఉండడం ఖాయం. అయితే వాస్తవానికి పవన్ కళ్యాణ్ లోకేష్ తో ఏ సినిమా కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారానికి వెళ్లే లోపే ఆయన చేతిలో ఉన్న సినిమాలన్నిటినీ పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయనకి కొత్త ప్రాజెక్టు చేసేంత తీరికలేదు. ఇప్పటికే రజనీకాంత్ తో ఒక సినిమా ఫిక్స్ చేశాడు లోకేష్.

సినిమాటిక్ యూనివర్సల్ భాగం కాబోతున్న కైతి టు తర్వాత విక్రమ్ 3 సినిమా చేయబోతున్నాడు లోకేష్.ఈ సినిమాల తర్వాత ఫ్యూచర్లో కొన్ని పవర్ఫుల్ కాంబినేషన్స్ రావచ్చు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా పెండింగ్లో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 75% పూర్తయింది .ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చేసే ఆసక్తి చూపడం లేదు పవన్. దాంతో ఈ సినిమా ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు పూర్తయిన సినిమాని మొదటి భాగంగా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన సినిమాని రెండవ పార్ట్ లాగా విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట క్రిష్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: