మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ `2018` కేరళ వరద భీభత్సం ఆధారంగా తెరకెక్కి రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ని వసూళ్లతో షేక్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 2018 మాటే వినిపిస్తుంది.ఇక ఇప్పటికే సినిమా మాలీవుడ్ లో `కేజీఎఫ్-2` సినిమా వసూళ్లని క్రాస్ చేసింది. కేజీఎఫ్ అక్కడ మొత్తం 68 కోట్లు రాబడితే.. ఏకంగా 70 కోట్లను 2018 సినిమా దాటేసింది.ఇక పాన్ ఇండియా సంచలనం..తెలుగు సినిమా అయిన `బాహుబలి` వసూళ్లని సైతం 2018 బీట్ చేసి అక్కడ సరికొత్త చరిత్రనే తిరగ రాసింది. `బాహుబలి` ఆ రాష్ట్రంలో ఏకంగా 73 కోట్ల వసూళ్లను సాధిస్తే వాటిని 2018 ఎంతో సునాయాసంగా చేధించింది. ఇక ఇదే వేగాన్ని కొనసాగిస్తే 78 కోట్ల షేర్ తో టాప్ లో ఉన్న `పులిమురుగన్` రికార్డులను కూడా 2018 క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇక మరో పది రోజుల్లో ఆ రికార్డు కూడా ఈజీగా బ్రేక్ అవుతుందని భావిస్తున్నారు. పులిమురగన్ సినిమా 137 కోట్ల గ్రాస్ వసూళ్లతో నెంబర వన్ స్థానంలో ఉండగా 150 కోట్ల గ్రాస్ వసూళ్లతో 2018 క్రాస్ చేసి సరికొత్త చరిత్ర రాసింది.


కేవలం మలయాళం రిలీజ్ తోనే ఈ సినిమా ఇంత సంచలనమైంది. ఇక ఇటీవలే సౌత్ లో మిగతా భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు సినిమా వచ్చింది. దీంతో ఇప్పుడీ సినిమా వసూళ్లు బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఖచ్చితంగా పెద్ద సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. ఇక నిన్న తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా మేం ఫేమస్, మళ్ళీ పెళ్లి సినిమాల కంటే ఎక్కువ వసూళ్ళని నమోదు చేసింది.2018 వ సంవత్సరంలో సంభవించిన కేరళ వరదల నేపథ్యంలో ఈ సినిమాను జూడ్ ఆంథనీ జోసెఫ్  తెరకెక్కించారు.మలయాళం స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కుంచాకో బోబన్- అసఫ్ అలీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ- పీకే ప్రైమ్ ప్రొడక్షన్ పతాకాలపై వేణు కున్నపల్లి- సీకే పద్మకుమార్- ఆంటో జోసెఫ్ ఈ సినిమాని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: