యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు జరిగి ఏడు రోజులవుతోంది. తారక్ పుట్టినరోజు జరిగిన రోజునే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు సైతం జరిగాయనే సంగతి తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు కూడా ఈ ఈవెంట్ కు సంబంధించి ఆహ్వానం అందింది. అయితే తారక్, కళ్యాణ్ రామ్ఈవెంట్ కు రాలేదు. అయితే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ పై బురద జల్లే కార్యక్రమం మొదలైంది.

పుట్టినరోజు కన్నా, కుటుంబ టూర్ ముఖ్యమని చెప్పాడట ఎన్టీఆర్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ దే తప్పని ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్ తనపై ఎన్ని నెగిటివ్ కామెంట్లు చేసినా రియాక్ట్ కారు. ఎవరైతే ఆహ్వానం ఇచ్చారో వాళ్లే ఈ విమర్శలను మొదలుపెట్టడం గమనార్హం. తారక్ ను ఆహ్వానించడం ఎందుకు? తారక్ వ్యక్తిగత కారణాల రాలేనని అప్పుడే చెప్పినా విమర్శించడం ఎందుకు? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లో కి వస్తాడ నే భయం తో ఆయనను విలన్ చేసే ప్రయత్నం జరుగుతోందని అసలు నిజాలను తారక్ బయట పెట్టిన రోజున పోయేది మీ పరువేనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా ఇకనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని తనపై నెగిటివ్ ప్రచారం చేసేవాళ్ల కు దూరం గా ఉండాలని అభిమానులు మనస్పూర్తి గా కోరుకుంటున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా తో బిజీగా ఉన్నారు. దేవర సినిమా రికార్డులను క్రియేట్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దేవర రికార్డు క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ భావి స్తున్నారు. ఏదో ఒక రోజు తారక్ సమాధానం ఇస్తే మాత్రం ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ల కు తగిన గుణపాఠం తారక్ చెప్పడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: