కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు పొందిన కమలహాసన్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రెండు దశాబ్దాల క్రితం విడుదలైన చిత్రం భారతీయుడు.. ఈ సినిమా అప్పట్లో ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.. ఇక అప్పటి రోజులు తో పోలిస్తే నేడు రాజకీయ నాయకులలో అధికారులలో అవినీతి వందరెట్లు పెరిగిపోయింది.. కానీ ఎక్కడా కూడా ఇంత కూడా తగ్గలేదని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. అమాంతం పెరిగిన అవినీతి ప్రపంచం పైన సేనాపతి ఎలాంటి పోరాటం సాగిస్తారన్న కథతో ఈ చిత్రాన్ని ఇండియన్-2 గా తెరకెక్కిస్తున్నారు శంకర్.


అంతేకాకుండా ఈ సినిమా ప్రారంభం నుంచి పదే పదే పలు రకాల ఇబ్బందులతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది..కాబట్టి దీన్ని బడ్జెట్ రేంజ్ కూడా అమాంతం  పెరిగిపోయిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాని త్వరగా పూర్తి చేసేందుకు శంకర్ చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమాని పూర్తిచేసే పనిలో పడ్డాడు శంకర్. భారతీయుడు-2 సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంపై నటుడు సిద్ధార్థ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది.


తాజాగా ఇంటర్వ్యూలో భారతీయుడు-2 సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో కీలకమైన పాత్రను పోషించిన సిద్ధార్థ్ మాట్లాడుతూ.. భారతీయుడు కంటే సీక్వెల్ పదింతలు పెద్దదిగా ఉంటుందని అది విజువల్ గా ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నానంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు సిద్ధార్థ్.. భారతీయుడు-2 తన డ్రీమ్ ప్రాజెక్టు అని సిద్ధార్థ్ తెలియజేశారు. ఇక తన నటించిన కొత్త సినిమా టక్కర్ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ శంకర్ సార్ నన్ను ఈ సినిమా ప్రపంచానికి పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ తెలిపారు.. నన్ను లాంచ్ చేసిన అదే గొప్ప దర్శకుడు మళ్ళీ నన్ను నమ్మి మరో ప్రాజెక్ట్ కోసం పిలిచారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: