శివాత్మిక రాజశేఖర్ తనలోని పరువాలు రుచి చూపిస్తుంది. టెంప్టింగ్ ఫోజుల్లో యువతకు హార్ట్ ఎటాక్ తెస్తుంది. శివాత్మిక లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.శివాత్మికకు అన్నీ హోమ్లీ రోల్స్ దక్కుతున్నాయి. అయితే ఆమె గ్లామరస్ హీరోయిన్ ఇమేజ్ కోరుకుంటున్నారు. అందుకే హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతుంది. శివాత్మిక టెంప్టింగ్ ఫోజులు చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. శివాత్మిక లేటెస్ట్ మూవీ రంగమార్తాండ. ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణల కూతురు పాత్రలో ఆమె అలరించారు.

ఓ తరహా పాత్రలకు శివాత్మిక  చక్కగా సెట్ అవుతారు. రంగమార్తాండ మూవీలో శివాత్మిక పాత్రకు ప్రశంసలు దక్కాయి. రంగమార్తాండ మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ రాలేదు. శివాత్మికకు మంచి పాత్రలు దక్కుతున్నా కమర్షియల్ సక్సెస్ రావడం లేదు. చెప్పాలంటే శివాత్మికకు బ్రేక్ ఇచ్చే మూవీ ఇంకా పడలేదు. హీరో రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. 2019లో విడుదలైన దొరసాని ఆమె మొదటి చిత్రం. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అందుకుంది.అయితే కమర్షియల్ గా ఆడలేదు. గత ఏడాది శివాత్మిక నటించిన ప్రయోగాత్మక చిత్రం పంచతంత్రం విడుదలైంది. పంచతంత్రం చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కలేదు. అలాగే ఆకాశం టైటిల్ తో విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ కూడా ఆడలేదు. కాగా తమిళంలో కూడా శివాత్మికకు ఆఫర్స్ వస్తున్నాయి. ఏక కాలంలో రెండు పరిశ్రమల్లో శివాత్మిక అదృష్టం పరీక్షించుకుంటున్నారు. శివాత్మికను కనీసం టైర్ టు హీరోలు కూడా పట్టించుకోవడం లేదు.

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల పట్ల చిన్న చూపు ఉంటుంది. తెలుగు పరిశ్రమలో తెలుగు అమ్మాయిలు ఎదగడం అంత ఈజీ కాదు. ఈ విషయం చాలా మంది హీరోయిన్స్ విషయంలో రుజువైంది. అందుకే శివాత్మిక కోలీవుడ్ మీద కూడా కన్నేశారు. మరి ఈ స్టార్ కిడ్ కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: