నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో ఒక ప్రాజెక్టు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లిల నటిస్తోంది.. బాలయ్య కెరియర్ లో ఈ చిత్రం 108వ చిత్రంగా విడుదల కాబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ పైన మంచి హైప్ క్రియేట్ అయింది. బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు కూడా విలన్ గా నటించబోతున్నారు.

సినిమా టైటిల్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరొకవైపు బాలయ్య బర్తడే దగ్గర పడుతూ ఉండడంతో అభిమానులు సైతం సెలబ్రేషన్స్ చాలా అంగరంగ వైభవంగా ప్లాన్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే బాలయ్య అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది చిత్ర బృందం.ఎన్.బి.కె -108 మేకర్ ఈ టైటిల్ ని రివిల్ ఈరోజు చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని నిన్నటి రోజున అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ ను వినూత్నంగా  ప్రకటించబోతున్నట్లు సమాచారం.


దాదాపుగా ఏకంగా 108 హూర్టింగ్స్ పై ఈ టైటిల్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా టైటిల్ విషయంలో అనేక రకాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.ఈ సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.బాలయ్య సినిమాలకు దాదాపుగా సింహం ఉండే పేరును మాత్రం ఎక్కువగా పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు డైరెక్టర్.. మరి ఈ సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ పెట్టేందుకే ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా షూటింగ్ కూడా ఈ సినిమా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా ఏడాది దసరాకి విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: