పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ జక్కన్న రాజమౌళి చెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు సృష్టించింది. పైగా బెస్ట్ సాంగ్ కేటగిరీలో 'నాటు నాటు' సాంగ్‌కు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది.ఈ సినిమా చూసి హాలీవుడ్ సినీ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా 'ఆర్ఆర్ఆర్' సినిమాపై మరో ఇద్దరు హాలీవుడ్ స్టార్స్ కూడా పొగడ్తలు కురిపించారు. హాలీవుడ్ హీరో అయిన 'టోబే న్యిగ్యి' తాజాగా 'ఆర్ఆర్ఆర్' సినిమా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం రిలీజైన తన సినిమా 'ట్రాన్స్ ఫార్మ్- రైజ్ ఆఫ్ ది బీస్ట్' సినిమా ప్రమోషన్‌ లో భాగంగా టోబే ఈ విధంగా మాట్లాడాడు. 'నేను కూడా 'ఆర్ఆర్ఆర్' సినిమాని చూశాను. ఆ సినిమా నాకు చాలా విపరీతంగా నచ్చేసింది. స్టోరీతో పాటు ఇతర అన్ని ఎలిమెంట్స్ నాకు చాలా అద్భుతంగా అనిపించాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ నటన అయితే చాలా అద్భుతం. అయితే ఇందులో నాటు నాటు డాన్స్ మాత్రం నేను ట్రై చేయలేను. అది అసలు నా వాళ్ళ కాదు' అని నవ్వుతూ చెప్పాడు.


ఇంకా అలాగే, మరో హాలీవుడ్ స్టార్ 'క్రిస్ హెమ్స్ వర్త్' కూడా 'ఆర్ఆర్ఆర్' సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు జూనియర్ ఎన్టీఆర్ పై కూడా ఈ హాలీవుడ్ నటుడు పొగడ్తల వర్షం కురిపించారు. 'ఆర్ఆర్ఆర్ సినిమాను రీసెంట్ గా చూశాను. సినిమా చాలా అద్భుతంగా అనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ నటన చాలా అద్భుతం.ఇంకా అలాగే రామ్ చరణ్ కూడా బాగానే చేశాడు. ఒకవేళ వారితో కలిసి నటించే అదృష్టం నాకు లభిస్తే అది నిజంగా అద్భుతమే''అని ఓ ఇంటర్వ్యూలో క్రిస్ తెలిపారు. ఇక క్రిస్ హెమ్స్ వర్త్ త్వరలో 'ఎక్స్ ట్రాక్షన్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.తన సినిమా ప్రమోషన్ లో క్రిస్ ఇలా మాట్లాడాడు.మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్ స్టార్స్ ను కూడా చాలా అమితంగా ఆకట్టుకుంటుంది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా సినీ ప్రియుల చర్చలన్నీ ఆర్ఆర్ఆర్ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: