ఇలా వీరిద్దరూ ప్రేమ లో ఉండి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా నిర్ణయం తీసుకోవడం తోనే తన భార్య కు విడాకులు ఇచ్చారని తెలుస్తోంది. కానీ నయనతార తో పెళ్లి అనేది కేవలం ఆశగానే మిగిలిందని చెప్పాలి. ఇక నయనతార తో కూడా బ్రేకప్ చెప్పుకున్నటువంటి ప్రభుదేవా రహస్యం గా రెండో వివాహం చేసుకున్నారు. ఈయన వెన్నునొప్పి సమస్య తో బాధపడుతున్న సమయం లో తనకు ట్రీట్మెంట్ చేసినటువంటి ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ హిమానీ అనే అమ్మాయితో ప్రేమలో పడి 2020వ సంవత్సరం లో తనని రహస్యంగా వివాహం చేసుకున్నారు..
ఇలా రహస్య వివాహం చేసుకున్నటువంటి ఈయన తాజా గా తన పుట్టినరోజు సందర్భం గా ఆమె తనకు శుభాకాంక్షలు చెబుతున్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ఇలా మొదటిసారి ప్రభుదేవా తన రెండవ భార్యను అందరికీ పరిచయం చేశారు. అయితే తాజా గా తన రెండో భార్య పండంటి ఆడబిడ్డ కోసం జన్మనిచ్చారని,దీంతో ప్రభుదేవా ముచ్చటగా మూడోసారి 50 సంవత్సరాల వయసు లో తండ్రి అయ్యారు అంటూ ఓ వార్త సంచలనం గా మారింది. మరి ప్రభుదేవా గురించి వస్తున్నటువంటి ఈ వార్తల లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి