తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే తెలుగమ్మాయిలాగా కనిపించి ఎందరినో ఆకట్టుకుంది. దాని తర్వాత వరుస సినిమాలో చేస్తూ చందమామగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజల్. దాని తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమాలో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది కాజల్ .ఇక ఈ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 ఇక ఈ సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది కాజల్. స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సినిమాల్లో కూడా నటించి మెప్పించింది ఈమె. అనంతరం పెళ్లి చేసుకుని ఒక పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ప్రస్తుతం కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది కాజల్ .త్వరలోనే ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

తాజాగా ఈ సినిమా నుండి కాజల్ లుక్ ని రిలీజ్ చేశారు చిత్రం బృందం.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జరిపారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది కాజల్ .ఇందులో మాట్లాడుతూ మాకు ఇంత పేరు ప్రఖ్యాతలు రావడానికి కారణం తెలుగు ప్రేక్షకులు సత్యభామగా ఈసారి మీ ముందుకు రాబోతున్నాను ఇప్పటివరకు నేను ఇలాంటి పాత్ర చేయలేదు మొదటిసారిగా చేస్తున్నాను తప్పకుండా నా మొదటి ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది ఇక నేను ఎక్కడికి వెళ్ళినాను నా కొడుకు నీల్ ని తీసుకెళ్తుంటాను కానీ ఈసారి నేను నా బిడ్డను తీసుకురాలేదు కానీ సత్యభామ ప్రీ రిలీజ్ కు నా కొడుకును హైదరాబాద్కు కచ్చితంగా తీసుకొస్తాను అంటూ చెప్పుకొచ్చింది కాజల్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: