టాలీవుడ్ హీరో ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం లో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రాన్ని T సిరిస్ సమస్థ రూ.500 కోట్ల రూపాయలతో తెరకెక్కించడం జరిగింది. ఇందులో ఎక్కువగా బాలీవుడ్ నటీనటులు సైతమే నటించారు. సీత పాత్రలో కృతి సనన్ ఎంతో అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది.అయితే కొంతమంది కావాలని ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చేలా చేస్తూ ట్రోల్స్ అయ్యేలా చేస్తూ ఉన్నారు.
దీంతో ఈ ఎఫెక్ట్ సినిమా పైన పడుతుందని అందరూ భావించారు. కానీ అనుకోని విధంగా కలెక్షన్లతో దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ .300 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదని కూడా చెప్పవచ్చు.. రామాయణం కథ అంశంతో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. రావణాసుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కూడా నటించారు.
ఇతర పాత్రలో బాలీవుడ్ నటీనటులు సైతం నటించడం జరిగింది. అది పురుష్ చిత్రం రూ .300 కోట్ల మార్క్ ను అందుకోవడమే కాకుండా.. మూడు రోజుల్లోనే ఇంతటి కలెక్షన్లు చేయడమే కాకుండా ఆదివారం రోజు ఒక్కరోజు ఊహించని విధంగా రూ .100 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇదేవిధంగా ఈ సినిమా కలెక్షన్ చేసుకుంటూ వెళ్తే కచ్చితంగా ఈ సినిమా కొన్ని కోట్ల రూపాయలు రాబడుతుందని సినీ ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా కలెక్షన్లు రాబట్టి సక్సెస్ అవుతుందో చూడాలి మరి. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్-K, రాజా డీలక్స్ వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి