అప్పుడప్పుడు సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. చెప్పుకోవడానికి అంత పెద్దవేమి కాకున్నా కూడా కొన్ని కొన్ని సందర్భాలలో అవి కాస్త హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి.అటువంటిది గతంలో రాశిఖన్నా విషయంలో కూడా జరిగింది. నిజానికి ఆమెది పెద్ద ఇన్సిడెంట్ ఏమీ కాదు.. కానీ ఎన్టీఆర్ చేసిన పనికి వల్ల తను బాగా ఏడ్చేసిన ఘటన చోటుచేసుకుందని తెలిసింది. ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ మొదట్లో ఓ వెలుగు వెలిగిన రాశి ఇప్పుడు అవకాశాల కోసం ఆరాటపడుతుంది. బాలీవుడ్ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమై తొలిచూపులతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది రాశి. తర్వాత తెలుగు సిని పరిశ్రమలో కూడా అడుగుపెట్టగా.. మొదట అతిధి పాత్రలో మెప్పించింది.

ఆ తర్వాత ఓ సినిమాలో హీరోయిన్ గా చేయగా.. హీరోయిన్ గా కూడా బాగా మెప్పించింది. అలా వరుసగా పలు సినిమాలలో అవకాశాలు అందుకొని ఒక వెలుగు వెలిగింది. మధ్యలో కొన్ని ప్లాప్స్ కూడా అందుకుంది. అయినా కూడా వెనుకడుగు వేయకుండా కెరీర్ కోసం ముందుకు సాగాలని బాగా ప్రయత్నిస్తూనే ఉంది. ఇక ఒకప్పుడు బొద్దుగా ఉన్న రాశి అవకాశాల కోసం బాగా వర్కౌట్లు చేసి, డైటింగ్ చేసి సన్నబడింది. ఇక సన్నబడ్డాక తన అందాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఇదంతా పక్కన పెడితే రాశి ఖన్నా గతంలో ఎన్టీఆర్ చేసిన పనికి బాగా ఏడ్చింది అని తెలిసింది. ఇంతకు అసలేం జరిగిందంటే.. గతంలో ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రలలో కనిపించాడు. ఇక ఇందులో నివేదా థామస్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలో ట్రింగ్ ట్రింగ్ అనే పాట బాగా హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రాశి ఖన్నా కలిసి ఈ పాటకు డాన్స్ చేశారు. అయితే ఈ పాటలో ఎన్టీఆర్ కంటే తక్కువ స్టెప్స్ రాశి కన్నాకి ఇస్తున్నారని.. కొరియోగ్రాఫర్ స్టెప్స్ తారకే ఇస్తున్నారని తెగ ఏడ్చేసిందట.గతంలో ఈ విషయం గురించి ఎన్టీఆర్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తానే కోరియోగ్రాఫర్ కి చెప్పాడట. తన కన్నా ఆ అమ్మాయికి స్టెప్స్ తక్కువ ఇవ్వండి అని.. అప్పుడు కూడా రాశి కన్నా భయపడిందట. వద్దు వద్దు నీ ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేస్తారు అంటూ భయపడిందట. దాంతో ఎన్టీఆర్ ఏమి అనలేక సైలెంట్ అయ్యాడని తెలిసింది. అప్పుడప్పుడు సినిమాల విషయంలో నటీనటుల మధ్య ఇటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: