టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి శ్రీ విష్ణు తాజాగా సామజవరగమన అనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా ... వెన్నెల కిషోర్ ... నరేష్మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.14 కోట్ల షేర్ ... 2.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.04 కోట్ల షేర్ ... 1.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.72 కోట్ల షేర్ ... 3.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 3.90 కోట్ల షేర్ ... 7.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే శ్రీ విష్ణు ఆఖరిగా అల్లూరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచాడు. అలా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన శ్రీ విష్ణు "సామజవరగమన" అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: