పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' సినిమా టీజర్ నేడు ఉదయం రిలీజ్ అయ్యి విపరీతంగా వైరల్ అవుతుంది. యూట్యూబ్ లో ఈ టీజర్ పాత రికార్డులని బద్దలు కొడుతూ చాలా వేగంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వ్యూస్, లైక్స్, షేర్స్ ఇలా ప్రతిదానిలోనూ కూడా ఈ టీజర్ టాప్ లోకి దూసుకెళ్లిపోయింది.స్టార్ హీరో సినిమాల సందడంటే ఒకప్పటి రోజుల్లో వేరుగా ఉండేది. ముందుగా పాటలు, అవొచ్చిన కొన్నాళ్లకు థియేటర్లలోకి ఆ సినిమా వచ్చేది. ఇప్పుడేమో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఫస్ట్ లుక్, టీజర్, లిరికల్ సాంగ్స్, ట్రైలర్.. ఇవన్నీ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అన్నట్లు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సలార్' మూవీ టీజర్ కేవలం 6 గంటల్లోనే మిలియన్ లైక్స్ సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.ఇప్పటికి ఇంకా వేగంగా ఈ టీజర్ వ్యూస్ లైక్స్ రాబడుతుంది.


ఇలా జస్ట్ ఒక్క టీజర్‌తో అతి తక్కువ సమయంలో మిలియన్ లైక్స్ సాధించిన హీరోగా టాలీవుడ్‌లో ప్రభాస్ సూపర్ రికార్డు సొంతం చేసుకున్నాడు.మిగతా హీరోల్లో పవన్ కళ్యాణ్ 24 గంటలు, జూ.ఎన్టీఆర్-36 గంటలు, అల్లు అర్జున్-2 రోజుల 11 గంటలు, మహేశ్ బాబు- 18 రోజులు, రామ్ చరణ్- 20 నెలల సమయం తీసుకున్నారు. ఇదంతా కూడా చూస్తుంటే సినిమాలపై అంచనాలు పెరగడం, థియేటర్లలోకి వచ‍్చిన తర్వాత ప్రేక్షకుల్ని అలరించడం అన‍్న దానికంటే సినిమా అనేది నంబర్ల గేమ్‌లా మారుతోందని నెటిజన్స్ ఈ రికార్డులని బట్టి అభిప్రాయపడుతున్నారు.ఇక సలార్ ఇప్పటిదాకా 34 మిలియన్స్ ఇంకా 1.3 మిలియన్ లైకులతో ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా దూసుకుపోతుంది.ఇక ఆది పురుష్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న ప్రభాస్ ఈ సినిమాతో ఖచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూడాలి సలార్ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: