తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది మీడియం రేంజ్ హీరోలు ఉన్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా కొంత మంది మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలకు కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తూ ఉంటాయి. అందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలుగా కంటిన్యూ అవుతున్న వారిలో నాలుగవ రోజు అత్యధిక కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన టాప్ 6 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ ... శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా సినిమా విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.72 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

జాతి రత్నాలు మూవీ కి విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.33 కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ లో నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించగా ... అనుదీప్ కేవీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈస్మార్ట్ శంకర్ మూవీ కి విడుదల అయిన నాలుగవ రోజు 4.81 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.

ఉప్పెన మూవీ కి విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.17 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ కి బుచ్చిబాబు సన దర్శకత్వం వహించాడు.

"ఎంసీఏ" మూవీ కి విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.81 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. నానిమూవీ లో హీరో గా నటించగా ... వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన బేబీ సినిమా విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.72 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: