తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోస్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ... బాలకృష్ణ ... విజయ్ దేవరకొండ ... శ్రీ విష్ణు లకు సంబంధించిన మూవీ షూటింగ్ లు ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ చిత్రీకరిస్తున్న ఈ యాక్షన్ సన్నివేశం ఈ మూవీకే హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంతు కేసరి అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో బాలకృష్ణ మరియు ఇతరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

విజయ్ దేవరకొండ హీరోగా మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రస్తుతం ఓ మూవీ ని రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ మూవీ మేకర్స్ ప్రస్తుతం విజయ్ ... మృణాల్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

శ్రీ విష్ణు ప్రస్తుతం స్వాగ్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ శ్రీ విష్ణు మరియు కొంత మంది ఇతరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: