ఇటీవలే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకుల ముందుకు భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలలో బేబీ సినిమా కూడా ఒకటి. డైరెక్టర్ సాయి రాజేశ్వరి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ .80 కోట్ల రూపాయల వరకు కలెక్షన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ,విరాజ్ అశ్విన్ ప్రధానోపాత్రలో నటించారు.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన నటనతో నటీనటుల సైతం ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా యూత్ ను ఆకట్టు కొనేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఓటీటి లో ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


తాజాగా ఎట్టకేలకు బేబీ సినిమా అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఈ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటి ప్లాట్ ఫామ్ అయినా ఆహా వేదికగా స్ట్రిమింగ్ కాబాతోంది. ఈ విషయాన్ని ఆహా సంస్థ తెలియజేస్తూ ఆహా అంటే అందరికీ ఇష్టం.. శుక్రవారం ఈ సినిమా అప్డేట్ ఇస్తామని తెలియజేసింది దీంతో ఈ సినిమా ఎక్కడ అని ఇన్ని రోజులు ఎదురు చూసిన వారికి ఎట్టకేలకు క్లారిటీ ఇవ్వడం జరిగింది.. బేబీ సినిమా ఈనెల 24 లేదా 25వ తేదీలో స్ట్రిమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


మొత్తానికి బేబీ సినిమా ఎప్పుడు స్ట్రిమింగ్ కాబోతుందో తెలియాలి అంటే మరో కొన్ని గంటలు ఆగాల్సిందే.. ఆహా ట్విట్టర్ నుంచి.. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ని సైతం విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా ఇందులో ఆటో పైన ఆహా అంటే అందరికీ ఇష్టం ఈరోజు ఈ సినిమా అప్డేట్ గురించి ఇస్తామంటూ కూడా తెలియజేశారు. చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టిన బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య కెరియర్ ఆనంద్ దేవరకొండ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరుగుతోందని చెప్పవచ్చు. ప్రస్తుత ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు సినిమాలు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: