నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంతు కేసరి సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులను అమ్మి వేసింది . ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ యొక్క వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులను ఈ మూవీ మేకర్స్ 75 కోట్లకు అమ్మినట్లు తెలుస్తుం ది. ఇకపోతే ఈ మూవీ యొక్క థియేటర్ హక్కులను ప్రపంచ వ్యాప్తంగా ఎవరెవరు దక్కించుకున్నారో తెలుసు కుందాం.

మూవీ ఒక నైజాం హక్కులను దిల్ రాజు దక్కించు కోగా ... సిడెడ్ హక్కులను అభిషేక రెడ్డి ... గుంటూరు హక్కులను పలువురి శ్రీను ... యు ఏ ఆకులను ప్రైమ్ షో ఫిలిమ్స్ , మెట్రో సురేష్ వారు దక్కించుకోగా ... ఈస్ట్ గోదావరి హక్కులను మైత్రి ఫిలిమ్స్ వారు ... వెస్ట్ గోదావరి హక్కులను ఆదిత్య ఫిలిమ్స్ వారు ... కర్ణాటక హక్కులను హరి కంబినీస్ వారు ... ఓవర్ సీస్ హక్కులను సరిగమ సినిమాస్ వారు దక్కించుకు న్నారు. ఇకపోతే ఈ మూవీ ని వీరు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. కాజల్ అగర్వాల్మూవీ లో బాలయ్య సరసన హీరోయిన్ గా కనిపించనుండగా ... సైన్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: