అయితే ఈసారి అలా కాకుండా అందరు ఈక్వల్ ఇమేజ్ ఉన్న వారినే తీసుకొస్తున్నారట. ఒకరు స్టార్ మరొకరు కామన్ అనేలా కాకుండా మాక్సిమం మెంబర్స్ అంతా కూడా ఒకేరకమైన ఇమేజ్ తో ఉన్న వాళ్లనే హౌజ్ లోకి తెస్తున్నారట. అంతేకాదు ఎప్పటిలానే ఒక మోడల్, ఒక యూట్యూబర్, ఒకరు జబర్దస్త్ షో నుంచి వస్తారని తెలుస్తుంది. అయితే ఈ సీజన్ లో ఎవరిని ఎక్కువ హైలెట్ చేయకుండా మొదటి నుంచి అందరినీ సమానంగా చూపించాలని ఫిక్స్ అయ్యారట బిగ్ బాస్ టీం.
అక్కడ జరిగే 24 గంటల విషయాన్ని గంటలో కుదించడం అల్ల కంటెస్టెంట్స్ గురించి వాళ్లు ఒకలా ఉంటే బయటకు మరోలా ప్రొజెక్ట్ అవుతుంది. అయితే ఈసారి అలాంటి తప్పులు కూడా చూసుకోవాలని కూడా బిగ్ బాస్ టీం తగిన జాగ్రత్తలు తీసుకుంటుందట. ఈ సీజన్ ఉల్టా ఫుల్టా అంటూ ప్రోమోలతోనే నాగార్జున సీజన్ పై ఇంట్రెస్ట్ కలిగించేలా చేస్తున్నారు. సెప్టెంబర్ 3న మొదలవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 ఎలా ఉండబోతుంది. ఈ సీజన్ లో ఎన్ని సర్ ప్రైజ్ లు ఎన్ని వింతలు జరుగుతాయన్నది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి