అయితే ఈయన దర్శకత్వంలో వచ్చిన ఢీ సినిమాలో ఎంత కామెడీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమానే కాకుండా ఈయన తీసిన ప్రతి ఒక్క సినిమాలో చాలా ఫన్ ఉంటుంది. అయితే ఈ సినిమాలో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు నటించిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఈ సినిమాకి మొదటి ఛాయిస్ మంచు విష్ణు కాదట రవితేజనట. కానీ రవితేజకు అవకాశం రానివ్వకుండా చేసి మోహన్ బాబు తన పెద్ద కొడుకు మంచు విష్ణు కోసం తీసుకున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. శ్రీనువైట్ల దగ్గరికి ఓసారి మోహన్ బాబు వెళ్లి నా కొడుకుని నీ దర్శకత్వంలో ఏదైనా సినిమాలో తీసుకో కచ్చితంగా హిట్ అవ్వాలి అని అడిగారట. దానికి శ్రీను వైట్ల ఒకే సార్ చేద్దాం. ప్రస్తుతం నేను రవితేజతో సినిమా చేసే పనిలో ఉన్నాను అని అన్నారట.కానీ మోహన్ బాబు మాత్రం ఒకసారి ఆ స్టోరీ చెప్పండి అనడంతో ఆ స్టోరీ రివిల్ చేశారట.అయితే ఈ స్టోరీ మోహన్ బాబు కి చాలా నచ్చి ఈ సినిమాలో నా కొడుకుని హీరోగా పెట్టండి రవితేజకు నేను చెబుతాను అని అంటే శ్రీను వైట్ల కాస్త మొహమాట పడ్డారట.
కానీ మోహన్ బాబు రవితేజ కి ఫోన్ చేసి నీ సినిమా నా కొడుకు కోసం తీసుకుంటున్నాను అంటే సరే అని రవితేజ కూడా సైలెంట్ అయ్యారట. కానీ శ్రీను వైట్ల విష్ణు ఈ సినిమాలో ఎలా చేస్తారో, కామెడీ ఈయనకు సెట్ అవుతుందో లేదో అని భయపడ్డారట.కానీ ఈ సినిమాలో మంచు విష్ణు ఒదిగిపోయి నటించారు. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.అలా రవితేజ నటించాల్సిన ఢీ సినిమా విష్ణు చేసి సూపర్ హిట్ కొట్టారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి