మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మొదట తెలుగు సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత అనేక భాషల సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే చాలా సంవత్సరాల పాటు కుర్ర హీరోల సరసన ఆడి పాడి ప్రేక్షకులను అలరించిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో మాత్రం సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి హీరో గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన భోళా శంకర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ మూవీ లో కూడా తమన్నా ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఈమెకు ఇండియన్ క్రికెటర్స్ అయినటువంటి రోహిత్ శర్మ , హార్దిక్ పాండ్యా , రవీంద్ర జడేజా పాత్రలను ఏ నటులు నటిస్తే బాగుంటుంది అనే ప్రశ్న ఎదురయింది.

దీనికి తమన్నా స్పందిస్తూ ... రోహిత్ శర్మ పాత్రను విజయ్ సేతుపతి , హార్దిక్ పాండే పాత్రను ధనుష్ , రవీంద్ర జడేజా పాత్రను అల్లు అర్జున్ చేస్తే బాగుంటుంది అని చెప్పుకొచ్చింది. ఇకపోతే తాజాగా తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం కూడా తమన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. సినిమాలతో పాటు తమన్నా ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: