తెలుగు చిత్ర పరిశ్రమలో  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న హీరో ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ పేరు చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మొన్నటి వరకు ప్రభాస్ తో పాటు రానా కూడా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉండేవాడు. కానీ ఇప్పుడు కేవలం ప్రభాస్ మాత్రమే ఇక పెళ్లికి దూరంగా ఉంటున్నాడు అని చెప్పాలి. 40 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా పెళ్లి అనే ఆలోచన చేయడం లేదు ఈ పాన్ ఇండియా స్టార్. అయితే ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 గతంలో కాజల్ అగర్వాల్తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత అనుష్క ప్రభాస్ జోడి సినిమాల్లో అందరికీ ఫేవరెట్ గా మారడంతో వీరిద్దరికీ త్వరలో పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఆదిపురుష్ సినిమాలో నటించిన కృతి సనన్ ప్రభాస్ ని జోడి కలుపుతూ నటిజన్స్ ఎన్నో వార్తలు రాశారు కానీ ఇవేవీ నిజం కాలేదు


 ప్రభాస్ ను పెళ్లి గురించి అడిగితే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసుకున్న తర్వాతే తాను పెళ్లి చేసుకుంటాను అంటూ వింత సమాధానం చెబుతూ తప్పించుకుంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు వరకు ప్రభాస్ ఎందుకు పెళ్లికి దూరంగా ఉన్నాడో అన్నది అభిమానులు అందరిలో కూడా నెలకొన్న ప్రశ్న. ఇక ఇదే విషయం గురించి ప్రభాస్ తో ఎంతో సాన్నిహిత్య బంధం ఉన్న జక్కన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ కు చాలా బద్ధకమని సోమరితనం ఎక్కువ అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే ప్రభాస్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు అంటూ తెలిపాడు.ఇక ఈ మాటలు విన్న ప్రభాస్ స్పందిస్తూ అవును నాకు సోమరితనం  ఎక్కువ పిరికి వాడిని ప్రజలతో కలవలేను నాకి మూడు సమస్యలు ఉన్నాయి అంటూ ప్రభాస్ చేసుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: