కార్తీకదీపం సీరియల్ ఫేమ్ నటి శోభా శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఈ సీరియల్ తో ఆమె ఎంత నీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో తెలిసిందే. సీరియల్స్ పుణ్యమా అని సోషల్ మీడియాలో సైతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ నటి సీరియల్స్ లో నటిస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. ముఖ్యంగా ఈమె షేర్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు అదృష్టం బావుండడంతో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంటుంది. నామినేషన్ ప్రక్రియలో రెండు సార్లు నామినేట్ అయినప్పటికీ హౌస్ లో ఎలాగో అలా నెట్టుకొచ్చింది. మూడవ వారం మాత్రం నామినేషన్ లో లేదు షోభాశెట్టి. అయితే ప్రస్తుతం శోభ శెట్టి కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. అయితే ఇటీవల తన రిలేషన్ పెళ్లి గురించి కొన్ని సీక్రెట్ విషయాలని బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. దానితో ఈ విషయం తెలిసిన వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే తాజాగా శోభా శెట్టి తన తోటి కంటెస్టెంట్ అయిన శుభశ్రీ దగ్గర తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ కొన్ని సంచలన నిజాలని బయట పెట్టింది.

ఈ నేపథ్యంలోనే శుభశ్రీ.. ని గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ ఏంటో చెప్పు అని అడగగా శోభా శెట్టి సంచలన విషయాన్ని బయటపెట్టింది. అయితే శోభా  తన పెళ్లి గురించి ఈ సందర్భంగా తెలిపింది. ఈ నేపథ్యంలోనే శోభా శెట్టి మాట్లాడుతూ నేను ఆల్రెడీ కమీటేడ్ అని.. నాకు ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది అని.. అదే నా సీక్రెట్ అంటూ వెల్లడించింది. అంతేకాదు ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు అని.. టేస్టీ తేజకి నిజం తెలియదు అంటూ శోభ శుభశ్రీతో చెప్పడంతో శోభయశ్రీ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హౌస్ లో లవ్ ట్రాక్ ఎంత జోరుగా నడుస్తుందో మనందరికీ తెలిసిందే. అలా ఇప్పుడు శోభా శెట్టి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఇప్పుడు శోభా శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ వ్యక్తి ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టారు బిగ్బాస్ లవర్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: