
అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం, పుష్ప సినిమాలు తనకు చాలా నచ్చాయని ఈ సినిమాలను తరచూ చూస్తూ ఉంటానని అట్లీ వెల్లడించారు. అయితే ఈ రెండు సినిమాలను తాను షారుక్ ఖాన్ కి కూడా చూపించాను అంటూ ఈ సందర్భంగా అట్లీ తెలిపారు.జవాన్ షూటింగ్ సమయంలోనే షారుఖ్ ఖాన్ గారికి ఈ రెండు సినిమాలను తాను చూపించాను అంటూ అట్లీ వెల్లడించారు. ఇలా తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమని అల్లు అర్జున్ సినిమాలను తరచు చూస్తూ ఉంటానని ఈయన చెప్పడంతో బన్నీ ఫాన్స్ ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే జవాన్ సినిమా మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ తో కూడా సినిమా చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత ఈయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నారు. మరి అల్లు అర్జున్ అట్లితో సినిమా ఎప్పుడు చేస్తారు ఏంటి అనే విషయాలు తెలియదు కానీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటూ ఒక వార్త గత కొద్ది రోజులుగా వైరల్ అవుతుంది.