ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా మకుటం లేని మహారాజుగా చక్రం తిప్పిన మెగాస్టార్ చిరంజీవి.. ఇక ఇప్పుడు సీనియర్ హీరోగా మారి పోయినప్పటికీ వరుస సినిమాలు చేస్తూ దూకుడు చూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. 60 ఏళ్ల వయసు దాటిపోయిన ఇంకా కుర్రాళ్లకు తాను ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తూ వరుసగా షూటింగ్లలో పాల్గొంటూ ఉన్నాడు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా చిరు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటున్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమం  లోనే మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన సినిమా అప్డేట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోతున్నాయి. అయితే ఇటీవలే బోల శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తర్వాత సినిమా ఎవరితో ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారి పోయింది.ఈ క్రమం లోనే బింబిసారా ఫేమ్ వశిష్టతో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సోషియో ఫాంటసీ మూవీలను తెరకెక్కించడంలో వశిష్ట దిట్ట అన్న విషయం తెలిసిందే. ఈ విషయం బింబిసారా సినిమాతో నిరూపితమైంది. ఇక ఇప్పుడు చిరంజీవితో కూడా ఇలాంటి సోషియో ఫాంటసీ మూవీ చేయబోతున్నాడు అన్న వార్త వైరల్ గా మారింది.

 ఇదే విషయం గురించి డైరెక్టర్ వశిష్ట ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తర్వాత అటు మెగాస్టార్ చిరంజీవిని ఫాంటసీ సినిమాలలో చూడలేదు అంటూ వశిష్ట చెప్పుకొచ్చాడు.  ఆ సినిమా అప్పటి పిల్లలను ఆకట్టుకుందని.. ఇక ఇప్పటి పిల్లలకు మెగాస్టార్ ను అలాంటి పాత్రలో చూపించాలని అనుకుంటున్నాను అంటూ వశిష్ట చెప్పుకొచ్చాడు. ఇక ఈ డైరెక్టర్ మాటలతో సినిమాపై మెగా అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి. ఇక ఈ సినిమా అప్డేట్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: