
ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వును సమర్థించిన ద్విసభ్య ధర్మాసనం, మొత్తం చెల్లించని పక్షంలో సింగిల్ జడ్జి ముందు ఈ కేసులో తీర్పు వెలువడే వరకు విశాల్ నిర్మించిన చిత్రాలను థియేటర్లలో లేదా ఓటీటీ లో విడుదల చేయడాన్ని నిషేధించాలని ఆదేశించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు 2021 జనవరి నుంచి ఇప్పటి వరకు విశాల్‌కు చెందిన నాలుగు బ్యాంకు ఖాతాల ఖాతా వివరాలను, విశాల్‌కు చెందిన స్థిరాస్తుల ఆస్తుల పత్రాలతో పాటు వాటిని ఎప్పుడు కొనుగోలు చేశారనే వివరాలను కూడా దాఖలు చేయాలని ఆదేశించింది.అయితే గతంలో ఈ కేసు విచారణకు విశాల్ తరపున న్యాయవాది కోర్ట్ కు హాజరుకాలేదు.
ఆస్తి వివరాలు దాఖలు చేయడానికి మరో 6 రోజుల సమయం కోరారు విశాల్ తరపు న్యాయవాది. తదుపరి విచారణ సమయంలో విశాల్ 28 రోజుల పాటు షూటింగ్‌లకు హాజరుకావాల్సి ఉన్నందున వ్యక్తిగతంగా హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని అయితే విశాల్ కోరారు. దీనిని అంగీకరించిన న్యాయమూర్తి.. బ్యాంకుల నుంచి అదనపు పత్రాలు పొందేందుకు అలాగే కోర్టు కోరిన పత్రాల వివరాలను సమర్పించేందుకు గడువు ఇస్తూ విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేయడం జరిగింది.అంతేకాదు తదుపరి విచారణకు హాజరుకాకుండా విశాల్‌కు మినహాయింపు ఇవ్వాలని కూడా కోర్ట్ ఆదేశించింది.