మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసిన మూవీస్ కూడా ఉన్నాయి అని చెప్పాలి. ఇక ప్రేక్షకులందరికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచే మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. అలాంటి మూవీస్ లో చిరంజీవి హీరోగావివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఠాగూర్ సినిమా ఒకటి అని చెప్పాలి. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలకు మించి విజయం సాధించింది. తమిళ హిట్ మూవీ అయిన రమణ మూవీకి ఇది తెలుగు రీమేక్ అని చెప్పాలి.


 అయితే ఒరిజినల్ మూవీ కథకు ఇక చిరంజీవి నటించిన ఠాగూర్ మూవీ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశాడు డైరెక్టర్ వివి వినాయక్. వాస్తవానికి తమిళంలో తెరకెక్కిన రమణ మూవీ లో కమర్షియల్ సన్నివేశాలు ఉండవు. క్లైమాక్స్ లో హీరో పాత్ర చనిపోతుంది. కానీ తెలుగు వర్షన్ లో హీరో చనిపోతే నిర్మాతలు నష్ట పోయినట్టే అని చిరంజీవి భావించాడట. ఈ క్రమంలోనే మురగదాస్ అంగీకారంతో వివి వినాయక్ ఇక ఒరిజినల్ కథలో మార్పులు చేశాడట. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం అనే డైలాగ్ ఠాగూర్ సినిమాకు హైలెట్గా నిలిచింది అని చెప్పాలి.


 అయితే ఠాగూర్ సినిమా విడుదలై 20 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 20 ఏళ్లలో చిరంజీవి ఠాగూర్ మూవీ క్రియేట్ చేసిన ఒక రికార్డు మాత్రం ఇప్పటివరకు చెక్కుచెదరలేదు అని చెప్పాలి. ఈ సినిమా ఏకంగా 253 కేంద్రాల్లో 50 రోజులపాటు ప్రదర్శించబడింది. ఇక ఈ రికార్డు అందుకున్న తొలిగి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే సినిమాలోని నేను సైతం క్లైమాక్స్ సాంగ్ కి జాతీయ అవార్డు వచ్చింది. ఈ సినిమాలో బాల నటుడుగా తేజ సజ్జ కావ్య కళ్యాణ్ రామ్ నటించగా.. వాళ్ళిద్దరికీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు కూడా వచ్చింది అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఏ సినిమా కూడా 253 కేంద్రాల్లో 50 రోజులపాటు ప్రదర్శితం కాలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: