అక్కినేని అనే భారీ బ్యాక్ గ్రౌండ్ నుంచి నేటి తరానికి హీరోగా నాగార్జున వారసులు ఇద్దరు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కానీ కాస్త కూసో నిలదొక్కుకుంది మాత్రం కేవలం నాగచైతన్య అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి అటు నాగచైతన్యకు కూడా కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఆయన నటించిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకాదరణకు నోచుకోవడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక మంచి హిట్ సినిమా నాగచైతన్యకు కావాల్సి ఉంది  హిట్ సినిమా లేదు అంటే అతని కెరియర్ ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన తర్వాత సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్త పడుతున్నాడు నాగచైతన్య. కార్తికేయ 2 అనే సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్టు కొట్టిన చందు మొండేటితో సినిమా చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇక నాగచైతన్య కూడా ఈ మూవీపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయని చెప్పాలి. త్వరలోనే షూటింగ్ మొదలయ్యే చాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు బాగా అచ్చొచ్చిన  హీరోయిన్ సాయి పల్లవి నటిస్తూ ఉండడం గమనార్హం.


 గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన లవ్ స్టోరీ మంచి విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందించబోయేది ఎవరు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల దసరా సినిమాకి స్వరాలు అందించి ప్రేక్షకులు అందరిని కూడా ఉర్రూతలూగించిన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ నాగచైతన్య, చందు మొండేటి చిత్రానికి మ్యూజిక్ అందించబోతున్నాడట. ఇక ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కాగా జాలర్ల నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: