కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌ ఇటీవల `మార్క్ ఆంటోని` చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా మంచి ఆదరణ అందుకుంటుంది.. విశాల్‌ నటించిన గత చిత్రాలతో పోల్చి చూస్తే ఈ సినిమా కాస్త బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాతో విశాల్ కాస్త ఊరట పొందాడని చెప్పొచ్చు. అయితే విశాల్‌ కోర్ట్ కేసు ను ఎదుర్కోవల్సి వచ్చింది.తాజాగా ఆయన ఏకంగా తన ఆస్తులను, బ్యాంక్‌ బ్యాలెన్స్ వివరాలను కోర్ట్ కి సమర్పించడం చర్చనీయాంశంగా మారింది.అస్సలు ఏం జరిగిందంటే…

హీరో విశాల్‌  తన సినిమాలను ఆయనే నిర్మిస్తూ వుంటారు.ఈ క్రమంలో ఫైనాన్షియర్‌ అన్బచెలియన్‌ వద్ద ఆయన సుమారు 21.29కోట్లు ఫైనాన్స్ తీసుకున్నారు.తాను కట్టలేని స్థితిలో ఆ అమౌంట్‌ని లైకా సంస్థ చెల్లించింది. అందుకు గాను విశాల్‌ నిర్మించే సినిమాల హక్కులను లైకా సంస్థ ఇవ్వాల్సింది గా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవల విశాల్‌ హీరోగా నటించి, నిర్మించిన `వీరమే వాగై చుడుమ్‌` చిత్ర హక్కులను లైకాకి కాకుండా వేరే సంస్థకి విక్రయించారు. దీంతో లైకా ప్రొడక్షన్‌ సంస్త మద్రాస్ హైకోర్ట్ ని ఆశ్రయించింది. ఈ కేసుకి సంబంధించిన విచారణ మద్రాస్ హైకోర్ట్ లోని ప్రత్యేక న్యాయస్థానంలో జరిగింది.ఈ నెల 12 వ తేదీన ఈ కేసుని విచారించిన న్యాయమూర్తి పీటీ ఉషా.. విశాల్‌ తన స్థిరాస్తులు, బ్యాంక్‌ ఖాతాల వివరాలను కోర్ట్ కి సమర్పించాలని ఆదేశించారు.. కానీ విశాల్‌ వాటిని పట్టించుకోలేదు. దీంతో ఈ నెల 19న జరిగిన విచారణలో కోర్ట్ దీన్ని కోర్ట్ ధిక్కరణ కిందకి పరిగణించాల్సి వస్తుందనివిశాల్ ను హెచ్చరించింది. సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఇందులో విశాల్‌ తన ఆస్తుల వివరాలను కోర్ట్ కి అందించారు. స్టాండర్డ్ చార్టెడ్‌, ఐడీబీఐ, యాక్సెస్‌, హెచ్‌డీ ఎఫ్‌సీ మరియు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాల వివరాలను కూడా సమర్పించారు. కానీ ఇందులో పూర్తి వివరాలు లేకపోవడంతో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయల్సిందిగా లైకాని కోర్ట్ ఆదేశించింది

మరింత సమాచారం తెలుసుకోండి: