తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో కామెడీ సినిమాలలో హీరో గా నటించి ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు. ఇకపోతే సుడిగాడు సినిమా తర్వాత ఈయన నటించిన సినిమాలు దాదాపు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. అలాంటి సందర్భం లోనే ఈయన కామెడీ సినిమాలలో కాకుండా ఫుల్ సీరియస్ మరియు వైవిధ్యమైన సినిమా అయినటువంటి నాంది మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

ఇక ఈ సినిమాతో నరేష్ అద్భుతమైన విజయం అందుకోవడంతో అప్పటి నుండి ఈయన కూడా వైవిధ్యమైన సినిమాల్లో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందులో భాగంగా నాంది మూవీ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయం సాధించింది. ఇక ఈ మూవీ తర్వాత ఉగ్రం సినిమాలో హీరోగా నటించాడు. నాంది మూవీ కి దర్శకత్వం వహించిన విజయ కనక మేడల ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరచిన ఈ మూవీ "ఓ టి టి" లో పరవాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం అయింది. అందులో భాగంగా ఈ మూవీ కి 4.09 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాకు భారీ "టి ఆర్ పి" రేటింగ్ దక్కలేదు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: