
అప్పట్లోనే పాన్ ఇండియా హీరోయిన్గా చక్రం తిప్పింది అని చెప్పాలి. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడం ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో కూడా అగ్ర హీరోయిన్గా చక్రం చెప్పింది. ఇక తన అందం అభినయం నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు శ్రీదేవి అటు భౌతికంగా ప్రేక్షకులకు దగ్గరగా లేకపోయినప్పటికీ సినిమాలతో మాత్రం ప్రేక్షకుల మధిలో చెరగని ముద్ర వేసుకుంది అని చెప్పాలి. అయితే శ్రీదేవి సినిమాల్లో నటించినప్పుడు మాత్రమే కాదు సినిమాలకు దూరమైన సమయంలో కూడా ఆమె అందం ఎక్కడ తరగలేదు. హీరోయిన్లకు మించిన ఫిట్నెస్ తో ఆమె ఎప్పుడూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉండేది.
అయితే శ్రీదేవి ఫిట్నెస్ గురించి ఆమె భర్త బోనికపూర్ ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన బోనికపూర్.. శ్రీదేవిది సహజ మరణం కాదు అంటూ చెప్పుకొచ్చాడు. అది ప్రమాదవశాత్తు సంభవించింది అంటూ తెలిపాడు. ఆమె మరణం తర్వాత దుబాయిలో నన్ను 48 గంటల పాటు విచారించారు. భారతీయ మీడియా నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే ఇలా విచారణ చేయాల్సి వస్తుంది అని అక్కడి అధికారులు తెలిపారు అంటూ బోనీకపూర్ చెప్పుకొచ్చాడు. ఇక శ్రీదేవి ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ అందంగా నాజూగ్గా కనిపించడానికి.. శ్రీదేవి ఎప్పుడు కడుపు మాడ్చుకునేది అంటూ బోనీకపూర్ వ్యాఖ్యానించాడు. ఎప్పుడు డైట్ చేస్తూ సరిగ్గా తినేది కాదు అంటూ తెలిపాడు.