రామ్ పోతినేని హీరోగా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ డ్రామా 'స్కంద'.యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని 'శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్' బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.బాలీవుడ్ హాట్ బ్యూటీ సాయి మంజ్రేకర్ కూడా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ , పాటలకి మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ‘స్కంద’ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఇక సెప్టెంబర్ 28 న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది.‘స్కంద’ మూవీకి రూ. 47 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.48 కోట్లు షేర్ ని వసూలు చేయాలి. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.30 కోట్లు షేర్ ను రాబట్టింది.ఇక గ్రాస్ విషయానికి వస్తే 45 కోట్లు వసూలు చేసింది.అయితే బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. వీక్ డేస్ లో బాగా నిలదొక్కుకుని రెండో వీకెండ్ మళ్ళీ గ్రోత్ చూపిస్తే కానీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


అలాగే లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'చంద్రముఖి 2 '. 'లైకా ప్రొడక్షన్స్' బ్యానర్ పై సుబాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంలో కంగనా రనౌత్ ఇంకా మహిమ నంబియార్ హీరోయిన్లుగా నటించారు.2005 లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాకి రెండో భాగంగా ఈ సినిమా రూపొందింది. దీంతో ‘చంద్రముఖి 2 ‘ పై అంచనాలు బాగానే పెరిగాయి.ఇక మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. అందువల్ల కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.వీక్ డేస్ లో ఇంకా తగ్గాయని చెప్పాలి. ఈ సినిమాకి ఇప్పటిదాకా 42 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇంకా 20 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 20 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: