సాదరణంగా సోషల్ మీడియాలో సినీ తారలకు సంబంధించి ఏ చిన్న విషయం తెరమీదకి వచ్చిన.. అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్ అనేది తెరిచిన పుస్తకమే. కానీ పర్సనల్ లైఫ్ లో కొన్ని విషయాలను రహస్యంగానే ఉంచుకోవడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి రహస్యాలను తెలుసుకోవడానికి అభిమానులు అందరు తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఏదో ఒకటి తెలుసుకోవడం కోసం తెగ వెతికేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఇక కొన్ని కొన్ని సార్లు అయితే ప్రేక్షకులు వెతకకుండానే కొన్ని విషయాలు తెర మీదకి వస్తూ ఉంటాయి. అందరికీ తెలిసిన స్టార్ హీరోలకు సంబంధించిన పాత ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి ఫోటోలు చూసి అందరూ షాక్ అవుతారు. ఇండస్ట్రీలో ఎలాంటి బాగ్రౌండ్ లేకుండా నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి వచ్చి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు చిన్నచిన్న గదుల్లో ఉంటూ తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల నుంచి ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతూ లగ్జరీ లైఫ్ ను గడుపుతున్న వారు కూడా ఉన్నారు.



 ఇలాంటి ఇద్దరు స్టార్లకు సంబంధించిన ఒక పాత ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు కూడా స్టార్లే. ఒకరు పాన్ ఇండియా సూపర్ స్టార్ అయితే.. మరొకరు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్నారు. ఈ ఫోటోలో ఒకరు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి అయితే.. మరొకరు అడ్డ కత్తితో పాపులారిటీ అందుకున్న దినేష్. 2009 అక్టోబర్ 9వ తేదీన తీసిన ఫోటో ఇది. దాదాపు 14 ఏళ్ళ క్రితం దినేష్ బర్త్ డే సందర్భంగా తీసిన ఫోటో అంటూ దినేష్ ఈ ఫోటోని ట్విట్టర్లో పంచుకున్నాడు.  ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: