టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా రామ్ చరణ్ కు ప్రత్యేకమైన స్థానం ఉన్నది..RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన రామ్ చరణ్ ఇటీవల డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన తదుపరిచిత్రం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ ఉన్నారు.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.అలాగే సునీల్, అంజలి చాలామంది నటీనటులు సైతం ఇందులో నటిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి కేవలం టైటిల్ అప్డేట్లను తప్ప పలు రకాల పోస్టర్లను విడుదల చేయడం జరిగింది..


అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ గురించి ఎలాంటి వార్తలు కూడా వినిపించలేదు..సినిమా ఆగిపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి..రామ్ చరణ్ rrr సినిమాతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో కాస్త వెనుక పడ్డారని అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు.. తెలంగాణ గేమ్ చేంజర్  సినిమా ఆలస్యం అవుతూ ఉండడంతో రామ్ చరణ్ కు మళ్ళీ లాంగ్ బ్రేక్ తప్ప లేదంటూ పలువురు నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై డైరెక్టర్ శంకర్ పై రామ్ చరణ్ అభిమానులు కాస్త ఫైర్ అవుతున్నట్లు సమాచారం.

గేమ్ చేంజర్ సినిమా నుంచి అప్డేట్లు తెలియజేయాలంటే సోషల్ మీడియాలో అడుగుతున్నారు మరొకవైపు ఈ సినిమాలపై వస్తున్న గాసిప్స్కు సైతం డైరెక్టర్ శంకర్ పులిస్టాప్ పెడుతున్నట్లు తెలుస్తోంది.. కేవలం ఇండియన్-2 సినిమా పైన ఫోకస్ చేస్తున్నారు.. గేమ్ చేంజర్ సినిమాని పట్టించుకోవడం లేదంటూ వస్తున్న వార్తలు రావడంతో వెంటనే రామ్ చరణ్ కొత్త సినిమా షెడ్యూల్ ని మొదలుపెట్టారు. అక్టోబర్ 10 వ తేదీన గేమ్ చేంజర్ న్యూ షెడ్యూల్ మొదలవుతోందని ఎమోషనల్ సన్నివేశం చిత్రీకరించబోతున్నట్లు శంకర్ తెలిపారు. అంతేకాకుండా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది మేకర్స్. అయితే ఎప్పుడూ కూడా పీఆర్ టీములు మాత్రమే ఇలాంటి వార్తలను ఖండిస్తూ ఉంటారు. కానీ డైరెక్టర్ శంకర్ నేరుగా ఒక పోస్టర్తో గాసిపులకు పుల్ స్టాప్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: