
ఈ ఎపిసోడ్కి ముఖ్య అతిథులుగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాలోని చిత్ర బృందం రావడం జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా అందుకు సంబంధించి ఒక ప్రోమో అని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆహా టీమ్.. బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షోకు కాజల్ అగర్వాల్, శ్రీ లీల, అర్జున్ రాంపాల్, డైరెక్టర్ అనిల్ రావుపూడి గెస్ట్లుగా రావడం జరిగింది. మొదట ఈ సినిమా ప్రోమో విషయానికి వస్తే మేము తప్పు చేయలేదని మీకు తెలుసు మేము తలవంచమని మీకు తెలుసు నన్ను ఆపడానికి ఎవరూ రాలేదని కూడా మీకు తెలుసు అంటే అనిపించింది అందం అనుకున్నది చేద్దాం ఎవడు ఆపుతాడో చూద్దాం అంటూ ఒక డైలాగ్ తో బాలయ్య ఎంట్రీ ఇచ్చారు.
ఆ తరువాత ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావు పూడి తన పంచులతో ప్రేక్షకులను బాగానే నవ్విస్తున్నట్లు తెలుస్తోంది. కాజల్ , శ్రిలీల లో కూడా ఎంట్రీ ఇచ్చి తమ డైలాగులతో పంచులు వేశారు. ముఖ్యంగా నందమూరి కొణిదెల హీరోలతో సినిమాలు చేసే ఫ్యూచర్ జనరేషన్తో మూవీ చేస్తావా అని అడగగా కచ్చితంగా అంటూ తెలిపింది కాజల్. అయితే ఇందులో శ్రీ లీల పెద్దగా మాట్లాడినట్లు కనిపించడం లేదు బాలయ్య అనిల్ రావిపూడి కాజల్ అగర్వాల్ ఎక్కువగా ఇందులో ఫోకస్ అవుతున్నారు.