టాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌  నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆదికేశవ.వైష్ణవ్ తేజ్ 4 వ సినిమా గా వస్తున్న ఈ పక్కా మాస్ యాక్షన్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ మూవీకి శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.అలాగే ఈ చిత్రం లో బీస్ట్‌ ఫేం అపర్ణా దాస్ మరియు జోజు జార్జ్‌  ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటికే ఆదికేశవ మూవీ నుంచి
మేకర్స్‌  విడుదల చేసిన సాంగ్స్ మరియు గ్లింప్స్ వీడియో సినిమా పై మరింత ఆసక్తి పెంచేసాయి.. ఈ మూవీ ట్రైలర్‌ ను నవంబర్ 17 న లాంఛ్ చేయనున్నారు. ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌ గా నిర్వహించనున్నారు.నవంబర్ 17 న హైదరాబాద్‌ లోని ఏఎంబీ సినిమాస్‌ స్క్రీన్‌ 3 లో  సాయంత్రం 4 గంటల నుంచి ఈవెంట్ జరుగనుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్ మెంట్స్,ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశి మరియు సాయి సౌజన్య సంయుక్తం గా నిర్మిస్తున్నారు. 'అంతా తవ్వేశారు.. మా గుడి జోలికి మాత్రం రాకండయ్యా.. శివుడికి కోపమొస్తే ఊరికి మంచిది కాదని విధ్వంసం సృష్టించేందుకు వచ్చిన రౌడీలతో పూజారి అంటుండగా.. వైష్ణవ్‌ తేజ్‌ ఆ రౌడీ ల అంతు చూసే యాక్షన్‌ సన్నివేశాల తో' కట్‌ చేసిన ఆదికేశవ గ్లింప్స్ వీడియో ఇప్పటికే సినిమాపై  అదిరిపోయే బజ్ క్రియేట్ చేస్తోంది.వైష్ణవ్‌ తేజ్‌ ఈ సినిమా లో పక్కా యాక్షన్‌ మాస్‌ అవతార్‌లో కనిపించబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడు. ఆదికేశవ రన్‌ టైం 2 గంటల 10 నిమిషాలు అని ఇప్పటికే అప్‌డేట్ కూడా వచ్చింది. ఆదికేశవ నుంచి హే బుజ్జి బంగారం మెలోడీ ట్రాక్‌ ను కూడా విడుదల చేయగా.. అందమైన లొకేషన్ల లో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: