ఇప్పుడున్న జనరేషన్ లో సినిమాలపై రివ్యూ లు ఎంతలా ప్రభావాన్ని చూపుతున్నాయో మనకి తెలిసిందే. ముఖ్యంగా సోషల్
మీడియా వాడకం వచ్చిన తర్వాత నుండి చాలామంది రివ్యూ చూసి ఆ తర్వాత
సినిమా చూడడానికి థియేటర్స్ కి వెళ్తున్నారు. కానీ నెగిటివ్ రివ్యూ వస్తే మాత్రం కచ్చితంగా ఆ
సినిమా కలెక్షన్స్ తగ్గుతాయి. అలా ఈ రివ్యూలు
సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపుతూ ఉంటాయి.
ఇదే విషయాన్ని ఇటీవల కొందరు తెలుగు నిర్మాతలు రివ్యూలు సినిమాలను చంపేస్తున్నాయని వ్యాఖ్యానించగా మరికొందరు తమకు రివ్యూ ముఖ్యం కాదని అభిప్రాయపడ్డారు. అయితే ఇదే విషయాన్ని కోలీవుడ్ వర్సటైల్ ఫిలిం మేకర్ వెట్రి మారన్ తనదైన శైలిలో ఓ ఉదాహరణతో మరి చెప్పాడు. తాజాగా తమిళ జర్నలిస్ట్ హోస్ట్ చేసిన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెట్రిమారన్ రివ్యూల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు." రివ్యూలు బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా పై ప్రభావం చూపుతాయని నేను అస్సలు అనుకోను. సుమారు ఏడు సంవత్సరాల క్రితం నేను నిర్మించిన ఒక సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి. కానీ ఆ సినిమా కేవలం రూ.1.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కానీ నెగిటివ్ రివ్యూస్ వచ్చిన సినిమాకి మాత్రం తొమ్మిది కోట్లు వచ్చాయి. వాస్తవంగా చెప్పాలంటే రివ్యూలు, రేటింగ్ లు సినిమాలను ప్రభావితం చేయవు" అంటూ చెప్పుకొచ్చారు వెట్రిమారన్. అదే సమయంలో కొంతమంది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు సినిమాకి మంచి సమీక్షలు అవసరమని చెప్పారని, ఎందుకంటే సినిమాకి మంచి రివ్యూస్ వస్తే యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ తమ సినిమా గురించి బాధపడరని, సినిమా సరిగ్గా ఆడకపోయినా రివ్యూస్ తో తృప్తిపడతారని రివ్యూస్, రేటింగ్స్ గురించి వెట్రిమారన్ మారన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు వెట్రిమారన్ . దీంతో వెట్రిమారన్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.