క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లు ఎప్పుడూ ప్రేక్షకులను కట్టిపడేస్తూనే ఉంటాయి.  క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో క్లూస్ టీం ప్రాముఖ్యతను చూపించేలా తెరకెక్కించిన చిత్రం  'అథర్వ'. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా  హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. డిసెంబర్ 1న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో సినిమా మీద మరింత ఆసక్తి కలిగించేలా స్నీక్ పీక్ 

అంటూ సింగిల్ షాట్‌‌లో తీసిన సీన్‌ను రిలీజ్ చేశారు.ఈ స్నీక్ పీక్‌లో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురి వ్యక్తుల హత్య జరుగుతుంది. క్లూస్ టీం వచ్చి క్లూస్ కలెక్ట్ చేసే పనిలో ఉంటుంది. ఈ క్లూస్ టీంలోనే హీరో హీరోయిన్లు ఉన్నారు. క్లూస్ ఎలా కలెక్ట్ చేస్తారో డీటైలింగ్‌గా చూపించారు. క్లూస్ కలెక్ట్ చేసే పనిలో టీం ఉంటే.. పోలీస్ వచ్చి తన డ్యూటీ తాను చేసుకుంటాడు. ఈ హత్యల గురించి సమాచారాన్ని మీడియాకు ఇస్తాడు. మూడు నిమిషాల పాటు ఉన్న ఈ సీన్‌ను సింగిల్ షాట్‌లో తీయడం విశేషం. ఇక ఆ హత్యలు చేసింది ఎవరు? ఎందుకు చేశారు?

ఆ అమ్మాయిని రేప్ చేసి హత్య చేసింది ఎవరు? వీటి వెనకాల ఉన్నది ఎవరో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా చూడాలంటే డిసెంబర్ 1 వరకు ఆగాల్సిందే. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఇటివల మరో మంచి బీట్ ఉన్న వీడియో పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. కేసీపీడీ అంటూ సాగే ఈ పాట అదిరిపోయింది. ఈ వీడియో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఊరి వాతావరణంలో ఎంతో సహజంగా ఈ పాటను తెరకెక్కించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: