తెలుగు అగ్ర హీరోగా పొందిన ఒక హీరో తనని లైంగికంగా వేధించారంటూ తమిళ నటి విచిత్ర బిగ్ బాస్ లో చేసిన కామెంట్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతో ఉన్నాయి.. ముఖ్యంగా హీరో తనతో మిస్ బిహేవియర్ చేయడం వల్లే ఇండస్ట్రీని వదిలేసాను అంటూ తెలియజేయడం జరిగింది. దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా ఇప్పటివరకు ఆమె కనిపించలేదట. కానీ ఆ హీరో ఎవరని విషయాన్ని మాత్రం చెప్పలేకపోయింది.. అయితే ఒక హీరో గురించి పలు రకాల రూమర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి.


అయితే ఇప్పుడు తాజాగా నటి షకీలా విచిత్ర కి మద్దతు తెలుపుతూ తను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొందని పలు సంచలన ఆరోపణలు తెలియజేయడం జరిగింది.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లను ఒకరైన ఇవివి సత్యనారాయణ ఒక సినిమాలో నటించిన తర్వాత తనను అడ్జస్ట్మెంట్ గురించి అడిగారని పలు ఆరోపణలు చేసింది అంతేకాకుండా తన నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి కూడా తనని గదిలోకి రమ్మని చెప్పి చెప్పారట.. దీంతో షకీలా ఈ విషయం నచ్చక తను నటించిన మొదటి సినిమాకి డబ్బులు ఇచ్చారు కదా రెండో సినిమా నాకు అవసరం లేదంటూ చెప్పిందట.


అయితే ఇవి సత్యనారాయణ గారు బతికి లేరు కాబట్టి దీని గురించి తెలుగు సినీ పరిశ్రమలో తనను ఎప్పుడు పిలిచి అడిగినా కూడా ఈ విషయాన్ని ధైర్యంగా ముందుకు చెబుతాను అంటూ తెలియజేశారు. ఆరోజు ఇవివి సత్యనారాయణ గారు తనని గదికి పిలిచారు.. ఇదే నిజం అంటూ తెలియజేసింది షకీలా. కానీ తన స్నేహితురాలు విచిత్ర తనని వేధించిన హీరో గురించి చెప్పలేదని ఒకవేళ ఆ హీరో పేరు చెప్పి ఉంటే బాగుంటుంది అంటూ తెలియజేసింది షకీలా. ప్రస్తుతం షకీలా చేసిన ఈ కామెంట్లు అందరిని ఆశ్చర్యానికి గురయ్యాలా చేస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: