ప్రతి సంవత్సరం చాలా మంది దర్శకులు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ అలా ఎంట్రీ ఇచ్చే వారిలో చాలా తక్కువ మంది మాత్రమే మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను అందుకొని అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి దర్శకులలో సందీప్ రెడ్డి వంగా ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే హీరోయిన్ గా రూపొందిన అర్జున్ రెడ్డి అనే మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు.

మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దీనితో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత ఈయన హిందీ లో అర్జున్ రెడ్డి మూవీ ని కబీర్ సింగ్ పేరుతో రీమిక్ చేశాడు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా యానిమల్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ డిసెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ పై ఇప్పటికే ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి జెమినీ సంస్థకు అమ్మివేసినట్లు అందులో భాగంగా ఈ మూవీ థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ... ఆ తర్వాత కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ సినిమా జెమిని టీవీ లో ప్రసారం కానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: