పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా సలార్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమైన ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.కేజీఎఫ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో హైప్ కూడా ఎక్కువగా ఉంది. ఇంకా అలాగే బాహుబలి 2 సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ నుంచి ఇప్పటి దాకా సాలిడ్ సక్సెస్ రాలేదు. ఆ లోటును సలార్ సినిమా తీరుస్తుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా భారీగా జరిగిపోయింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే సెప్టెంబర్ నెలలో రిలీజ్ అనుకున్న సమయంలో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే భారీగా జరిగాయి. వాటితో పోల్చుకుంటే ప్రస్తుతం తక్కువ అని చెప్పాలి. అయితే మూవీ ట్రైలర్ ని మరి కొంత సేపట్లో ముందుకి తీసుకొని రాబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ కోసం వేలాది మంది వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సినిమా ట్రైలర్ అనేది ఆ మూవీ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉండాలి అనేది డిసైడ్ చేసేస్తుంది.


మంగళవారం సినిమా చిన్న సినిమా అయిన మంచి ఓపెనింగ్స్ రావడానికి ఖచ్చితంగా ఆ సినిమా ట్రైలర్ కారణం అయ్యింది.ఇంకా అలాగే యానిమల్ మూవీ ట్రైలర్ తోనే అంచనాలు పీక్స్ కి సందీప్ రెడ్డి వంగా తీసుకొని పోయాడు. ఈ సినిమా నార్త్ ఇండియాలో అప్పుడే 3 మిలియన్ డాలర్ మార్క్ అందుకుంది.ఇప్పుడు సలార్ సినిమా ట్రైలర్ కూడా ఆ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ని డిసైడ్ చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటి దాకా ఇండియన్ ఇండస్ట్రీలో కేవలం బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలు మొదటి రోజు రెండు వందల కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేశాయి.ఆ స్టామినా సలార్ సినిమాకి ఉంది. అయితే ఈ సినిమా 200 కోట్లు అందుకోగలుగుతుందా లేదా అనేది ఈ ట్రైలర్ డిసైడ్ చేయనుందని భావిస్తున్నారు. మూవీ ట్రైలర్ బాగుంటే మాత్రం ఇప్పటి వరకు స్లోగా నడుస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్కసారిగా స్పీడ్ అప్ అవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే సలార్ మూవీ డబుల్ సెంచరీ మార్క్ ని అందు కోగలుగుతుందా లేదా అనేది ఈ రోజు క్లారిటీ వచ్చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: