నాని ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘హాయ్ నాన్న’ మూవీ ప్రమోషన్ కు అత్యంత కీలకమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగినది. ఈ ఈవెంట్ కు అత్యధికంగా నాని అభిమానులు హాజరు కావడంతో నాని మంచి జోష్ లోకి వెళ్ళిపోయాడు. సంక్రాంతి సినిమాల రేస్ ను తలపించే విధంగా ఈ సంవత్సరం డిసెంబర్ సినిమాల రేస్ కొనసాగుతూ ఉండటంతో ‘హాయ్ నాన్న’ మూవీ పై అందరిలోనూ ఆశక్తి బాగా పెరిగింది.ఈవెంట్ ను హోస్ట్ చేసిన యాంకర్ సుమ అత్యుత్సాహంతో చేసిన ఒక విషయం నానీకి అసౌకర్యాన్ని కలిగిస్తే విజయ్ దేవరకొండ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక వివరాలలోకి వెళితే ఈ ఈవెంట్ లో యాంకర్ సుమ కొందరు సెలబ్రిటీ జంటల ఫోటోలు చూపిస్తూ కొన్ని ప్రశ్నలు అడిగే గేమ్ లో భాగంగా స్క్రీన్ మీద విజయ్ దేవరకొండ రష్మికల ఫోటోలను చూపెట్టింది.అయితే వారిద్దరూ టీమ్ ని ప్రశ్నలు అడిగే గేమ్ లో భాగంగా స్క్రీన్ మీద విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు సేదతీరుతున్న పిక్ చూపించారు. వేర్వేరుగా ఒకే లొకేషన్ లో తీసుకున్న ఫోటోలను పక్కపక్కన పెట్టేసి దానికి ఒక కామెంట్ ఇవ్వాలని సుమ చేసిన ప్రయత్నం మిస్ ఫైర్ ఐనట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోలను చూసిన నాని ఏమానాలో అర్థంకాక తన నవ్వుతో కవర్ చేయాలని ప్రయత్నిస్తే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాత్రం ‘వాటీజ్ దిస్’ అంటూ స్పష్టంగా అసహనానికి లోనుకావడం స్పష్టంగా కనిపించింది.సముద్రం ఒడ్డున సేద తీరుతున్న విజయ్ రష్మిక లు వేరువేరు సందర్భాలలో వారు వ్యక్తిగతంగా విడివిడగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించిన అవి వారిద్దరు కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలు కావు. ఇలాంటి వ్యక్తిగత ఫోటోలను పబ్లిక్ ఫంక్షన్ లో సుమ ఎందుకు చూపెట్టింది అంటూ విజయ్ దేవరకొండతో పాటు రష్మిక అభిమానులు కూడ ఆమెను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు..మరింత సమాచారం తెలుసుకోండి: