బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం యానిమల్.. ఈ సినిమా ఆల్ టైం బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా మారుతోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వగా ఈ సినిమాతో తన మార్క ఏంటో చూపించారు. నిన్నటి రోజున ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ విషయంలో కూడా సినిమా చుట్టూ భారీ క్రేజీని ఏర్పడేలా చేశాయి. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఎలాంటి కలెక్షన్లు రాబట్టి ఉందో చూద్దాం..


యానిమల్ సినిమా మొదటి రోజు 60 కోట్ల మార్కును అధికమించి ఒక చరిత్రను సృష్టించింది. ఈ చిత్రంతో రణబీర్ మొట్టమొదటిసారి అతిపెద్ద ఓపెనింగ్ సైతం రాబట్టారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 110 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించినట్లు సమాచారం.. టి సిరీస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. సందీప్ రెడ్డి వంగ తన మార్కు ఏంటో ఈ సినిమాతో చూపించడం జరిగింది. విడుదలైన ప్రతి చోట కూడా ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది.


డైరెక్టర్ చిత్రీకరించిన తీరు హీరో నటించిన తీరు ప్రేక్షకులను అబ్బురపరిచేలా చేశాయి. ఇందులో వైలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ తనదైన స్టైల్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. రష్మిక కూడా ఇందులో చాలా అద్భుతంగా నటించింది అని వీళ్ళని కూడా చాలా స్టైలిష్ గా కురువంగా చూపించారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి వారం ముగిసే సమయానికి ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని చిత్ర బృందం చాలా ధీమాతో ఉన్నారు. 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. మరి ఏ మేరకు ఈ సినిమా కలెక్షన్లను అందుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: