ఎన్నో రోజుల నుంచి బులితర ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతున్న బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇక మరో రెండు వారాల్లో ఈ సీజన్ ముగుస్తుంది అన్న విషయం తెలిసిందే. అంతకుముందు సీజన్లతో పోల్చి చూస్తే ఈ సీజన్ ఉల్టా ఫుల్టా అంటూ వినూత్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక హౌస్ లో బిగ్ బాస్ నిర్వహిస్తున్న టాస్కులు ఎలిమినేషన్ ప్రక్రియ ఇలా అన్నీ కూడా ఎంతో ఆసక్తికరంగానే సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవలే ఆదివారం గౌతమ్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడంతో హౌస్ లో కంటెస్టెంట్ సంఖ్య ఏడుగురికి చేరుకుంది.

 ఈసారి బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ గా నిలిచేది ఎవరు అంటే చాలామటుకు ఇంటర్నెట్ జనాలు అందరూ కూడా పల్లవి ప్రశాంత్ పేరునే చెబుతున్నారు. ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక ఇప్పుడు తెలుగు ప్రజలందరికీ కూడా దగ్గరయ్యాడు. తన ఆట తీరుతో అందరిని మెప్పించాడు. దీంతో ఇప్పటికే తెలుగు ప్రజల గుండెల్లో ప్రశాంత్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఇటీవల ఆదివారం ఎపిసోడ్లో ప్రశాంత్ చేసిన ఒక పనికి ఇక అతని అభిమానులు అందరూ కూడా ఫిదా అయిపోయారు. సాధారణంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు.


 ఒకవేళ ఎవిక్షన్ పాస్ దక్కించుకుంటే ఎలిమినేషన్ సమయంలో ఆ ఎఫెక్షన్ పాస్ ని వాడుతూ ఉంటారు. కానీ ఎవిక్షన్ పాస్ దగ్గర పెట్టుకుని మరీ ప్రశాంత్ చెప్పిన మాట అందరిని ఫిదా చేసింది. ఎవిక్షన్ పాస్ ను వాడుకోవాలి అంటూ పల్లవి ప్రశాంత్ కు నాగార్జున సూచించాడు. ఇప్పుడు వాడుకోకపోతే ఎప్పటికీ వాడుకోలేవు అంటూ తెలిపాడు. ఒకవేళ నువ్వు వాడుకోకపోతే ఎవరికైనా ఇవ్వు అంటూ సూచించాడు  అప్పుడు ప్రశాంత్ మాట్లాడుతూ ఒకవేళ తనకు తక్కువ ఓట్లు వచ్చి ఎలిమినేట్ అయితే అది ప్రేక్షకుల నిర్ణయమే కాబట్టి బయటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రేక్షకుల నిర్ణయం ప్రకారమే వెళ్తా కానీ ఎవిక్షన్ పాస్ వాడుకొని ప్రేక్షకుల నిర్ణయాన్ని తప్పు పట్టలేను అంటూ ప్రశాంత్ చెప్పిన మాటలు ఏకంగా తెలుగు ప్రేక్షకులందరినీ కూడా ఫిదా చేశాయ్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: