కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యాష్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన "కే జీ ఎఫ్ చాప్టర్ 1" మరియు "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ లలో హీరో గా నటించి ఈ రెండు మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మూవీ లో శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి రవి బుశ్రుర్ సంగీతం అందించాడు. 

ఇకపోతే ఇప్పటికే "కే జీ ఎఫ్ చాప్టర్ 2" మూవీ విడుదల అయ్యి చాలా రోజులు అవుతుంది. ఈ విడుదల అయిన తర్వాత నుండి యాష్ ఆ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. ఈ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అని అనేక మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఈయన మాత్రం చాలా రోజుల పాటు చాలా సైలెంట్ గా కథలను వింటూ వచ్చాడు. ఇకపోతే తాజాగా ఈయన ఓ మూవీ ని ఓకే చేశాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

యాష్ నెక్స్ట్ మూవీ కి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ ను డిసెంబర్ 8 వ తేదీన ఉదయం 9 గంటల 55 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ చేసిన రోజే ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని క్రేజీ వివరాలను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: