మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఈగల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ సినిమాటో గ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ , కావ్య తప్పర్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ మూవీ బృందం ఈ సినిమా లోని మొదటి పాటను విడుదల చేయడానికి రెడీ అయింది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం ఈ మూవీ లోని మొదటి సాంగ్ అయినటువంటి "ఆడు మచ్చ" అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసింది. అలాగే ఈ మూవీ లోనీ మొదటి పూర్తి లిరికల్ వీడియోను డిసెంబర్ 5 వ తేదీన సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమాలోని మొదటి సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇది ఇలా ఉంటే రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ లో కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఆ తరువాత సుదీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన రావణాసుర అనే సినిమాలో సోలో హీరో గా నటించాడు. ఈ మూవీ ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచింది. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈయన టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నదుల విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: