సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ ఎవరు అంటే ప్రతి సినీ ప్రేక్షకుడు కూడా నయనతార పేరు చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే మొదట్లో గ్లామర్ పాత్రలతోనే అందరిలా ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఆ తర్వాత తన పంథా మార్చుకొని కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగుతుంది. అంతేకాదు తన సినిమాలతో తన పాత్రలతో ఇక సౌత్ సినీ ప్రేక్షకులందరికీ కూడా లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది. ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన నటిస్తూనే లేడి ఓరియెంటెడ్ సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది.



 అదే సమయంలో తన ప్రియ సఖుడు డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి కవలలు కూడా పుట్టారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు నయనతారకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార ఏకంగా ఒక హీరోకి అక్క పాత్రలో కనిపించబోతుందట. ఆ హీరో ఎవరో కాదు డైరెక్టర్, నటుడు అయినా ప్రదీప్ రంగనాథన్. కోమాలి అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ ఆ తర్వాత లవ్ టు డే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.


 దర్శకుడిగా, హీరోగా కూడా అటు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో అతని క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక అతని తర్వాత ప్రాజెక్టులపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ప్రదీప్ మరో సినిమాకు ఓకే చెప్పారు. అయితే దర్శకుడిగా కాదు కేవలం నటుడిగా మాత్రమే. ఈ మూవీని నాయనతార భర్త విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తూ   ఉన్నారు..  ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారిపోయింది. ఏకంగా హీరో ప్రదీప్ రంగనాథన్ కు అక్కగా నయనతార కనిపించబోతుందట. అంతేకాదు ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: