తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ మూవీ ల జోరు బాగానే నడుస్తుంది. దానితో చాలా మంది నటీమణులు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం అంజలి మరియు రష్మిక మందన కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం వీరు నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఏవి ..?  ప్రస్తుతం వాటి షూటింగ్ వివరాలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం.

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న నటీమణులలో ఒకరు అయినటువంటి అంజలి కొంత కాలం క్రితం గీతాంజలి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే సస్పెన్స్ హర్రర్ జోనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి అంజలి కి మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇకపోతే ప్రస్తుతం గీతాంజలి మూవీ కి కొనసాగింపుగా గీతాంజలి 2 అనే సినిమా రూపొందుతుంది. ఈ మూవీ లో కూడా అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఊటీ లో అంజలి మరియు మరి కొంత మంది ఇతరులపై ఈ సినిమా షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి చి లా సౌ ... మన్మధుడు 2 మూవీ లకు దర్శకత్వం వహించిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే రష్మిక తన కెరియర్ లో నటిస్తున్న మొట్ట మొదటి లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రష్మిక పై శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: